నల్గొండ జిల్లా నకిరేకల్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆ సభలో భట్టి మాట్లాడుతూ.. పాదయాత్ర తన స్వార్థం కోసం చేయడం లేదని.. సమస్త తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే కేసీఆర్ అప్పులపాలు చేశాడని ఆరోపించారు.