కరోనా సెకండ్ వేవ్ ఈ యేడాది తెలుగు సినిమా రంగాన్ని కాస్తంత కల్లోల పర్చింది. అయితే దానికంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన సహకారం లభించకపోవడం సినిమా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసింది. తెలంగాణలో మరోసారి సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసు విషయమై విచారణను ఎదుర్కొంటే, ఏపీలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రభుత్వ విధానాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మొత్తం మీద ఈ యేడాది సినిమా రంగ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు. గత యేడాది జరగాల్సిన…