విజయవాడ వెస్ట్ నుంచి తాను పోటీ చేయడం ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఆ విషయం తాను మీడియాలో చూసినట్లు చెప్పారు. ఒకవేళ అధిష్టానం అవకాశమిస్తే.. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. రేపు సాయంత్రం కల్లా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీలో ఎవ్వరికీ ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది.
సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో వరుణ్ గాంధీ పొలిటికల్ కెరీర్ ఇరాటకంలో పడింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా పార్టీల నుంచి నేతలు ఇటు అటు జంప్ అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడడం.. ఇంకోవైపు టికెట్లు లభించకపోవడంతో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిపోతున్నారు.
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ అంశంపై క్లారిటీ రానుంది. మచిలీపట్నం లోక్సభ స్థానం…
రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక గాంధీల (Priyanka gandhi) పోటీపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తికర చర్చ సాగింది. ఈసారి ప్రియాంకగాంధీ పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఖాయమైంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటిదాకా రాజకీయ వర్గాల్లో తీవ్ర సందిగ్ధం నెలకొంది.
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ (Justice Abhijit) రాజీనామా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్ని్కల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. హిందూపురం నుంచి స్వామీజీగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే మాత్రం అభివృద్ధి బాటలో నడిపిస్తానని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం పెద్దలు.. ఎంపీ సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ నమ్మకం తనకు ఉందని…