లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ (BJP) ఇప్పటికే 195 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వంతు వచ్చింది. తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (Congress CEC Clears) సమావేశం గురువారం అర్థరాత్రి వరకు జరిగింది. ఇందులో ముఖ్య నాయకుల పేర్లు ఆమోదించబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే కర్ణాటకలో 9 మంది పేర్లు దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిటీ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు రూరల్ (Bangalore rural) నుంచి డీకే సురేష్ (DK suresh) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేసినట్లు సమాచారం. వీలైనంత మట్టుకు ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది.
కర్ణాటక అభ్యర్థులు వీరే!
1. బెంగళూరు రూరల్: డీకే సురేష్
2. మాండ్య: స్టార్ చంద్రు
3. విజయపుర: రాజు హులుగూర్
4. బీదర్: రాజశేఖర్ పాటిల్
5. హసన్: శ్రేయాస్ పాటిల్
6. తుమకూరు: ముద్దె హనుమే గౌడ
7. చిత్రదుర్గ: బీఎన్ చంద్రప్ప
8. కలబుర్గి: రాధా కృష్ణ (మల్లికార్జున్ ఖర్గే అల్లుడు)
9. రాయచూరు: మాజీ కేఏఎస్ అధికారి కుమార్ నాయక్
దాదాపుగా కాంగ్రెస్ తొలి జాబితాను శుక్రవారమే ప్రకటించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే శనివారమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ 195 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసేసింది. బీజేపీ ప్రచారంలో దూసుకెళ్లిపోతుంది.