విమాన ప్రయాణమన్నా.. ట్రైన్ ప్రయాణాలన్నా.. కొద్ది రోజులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదంటే ప్రయాణం సాఫీగా సాగదు. అయితే కొన్ని సార్లు రిజర్వేషన్ అయ్యాక కూడా విమానాలు, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి.
Amazon founder warned about recession: సొమ్ములే ఆదా.. చెయ్యరా భాయి.. డాబుకే పోక.. డబ్బు పోగెయ్యి.. అని తెలుగు రచయిత చంద్రబోస్ 20 సంవత్సరాల క్రితమే బడ్జెట్ పద్మనాభం అనే మూవీ కోసం ఒక చక్కని పాట రాశారు. అమేజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎకానమీ ఏమంత బాగా లేదని, అందుకే అన్ని రంగాల్లోనూ ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఆర్థిక సంక్షోభం సవాళ్లు విసురుతోందని చెప్పారు.
మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది… 2021కి బైబై చెప్పి.. 2022లోకి అడుగుపెట్టబోతున్నాం.. అయితే, కొత్త సంవత్సరంలో అనేక మార్పులు రాబోతున్నాయి… బ్యాంకింగ్ రంగంలోతో పాటు.. ఇతర రంగాల్లోనూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా…
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. విద్యుత్ ఛార్జీల పెంపు స్వల్పంగానే ఉంటుంది. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజలు సమర్దిస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. గడిచిన ఏడు సంవత్సరాల్లో ఒక్క పైసా పెంచలేదు. తెలంగాణ పక్క రాష్టాల్లో అక్కడి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచాయి. సింగరేణి…
సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు చేరువవుతోంది.. పెట్రో ధరలతో పాటు క్రంగా గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇదే సమయంలో.. వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. దీనిపై అంతర్గతంగా చర్చ ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరుసగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలపై ప్రభుత్వం ఓ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వేలో.. పెరిగిన గ్యాస్ ధరలను చెల్లించేందుకు…