వధువు విషయంలో కేరళలోని ఒక జిల్లా వినియోగదారుల కోర్టు మ్యాట్రిమోనీకి షాకిచ్చింది. ఒక వ్యక్తికి వధువును కనుగొనడంలో విఫలమైనందుకు మ్యాట్రిమోనీ సైట్‌ను బాధ్యులను చేయడమే కాకుండా దానికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది. అంతే కాకుండా బాధితుడి ఖర్చు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్‌మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. సూపర్‌మార్కెట్లలో షాపింగ్ చేసిన వారికి ఆ మాల్ వారే క్యారీ బ్యాగ్‌లు ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మాల్స్‌లో క్యారీబ్యాగ్‌లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Rat : అసోంలోని వినియోగదారుల ఫోరం ఇటీవల ఓ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని సినిమా హాల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. స్క్రీనింగ్ సమయంలో వ్యక్తిని ఎలుక కాటువేయడంతో సినిమా హాల్ యజమానికి కోర్టు ఈ దిశానిర్దేశం చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలికి అక్షింతలు వేసింది కన్స్యూమర్ కోర్టు… దర్శనం కేటాయింపు చేయనందుకు పరిహారంగా సంబంధిత భక్తుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు… అయితే, తమిళనాడు రాష్టం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు… మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ.12,250 చెల్లించారు.. కానీ, ఇప్పటి వరకు దర్శనం కల్పించలేదు టీటీడీ.. 17 సంవత్సరాలుగా పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు హరి…