రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు.
Kiren Rijiju: లోక్‌సభలో భారత రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజ్యాంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
Constitution Debate: భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయినా సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ కొనసాగనుంది. ఈరోజు (డిసెంబర్ 13) లోక్‌సభలో ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని స్టార్ట్ చేయనున్నారు.
రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్‌సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం