Etela Rajender : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) , కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి చేశారు. ఈ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలు అని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అనేక సమావేశాలు నిర్వహించడం వెనుక వైఫల్యాలను దాచిపెట్టే ఉద్దేశమే ఉందని ఈటల అన్నారు. హైదరాబాద్‌లో ఒకటి కాదు, ఏకంగా 50 మీటింగ్‌లు పెట్టినా,…
Delimitation : నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో రెండో సదస్సుకు హైదరాబాద్‌లో వేదిక కానుంది. పునర్విభజనకు సంబంధించి చెన్నైలో శనివారం నిర్వహించిన సదస్సు ఈ మేరకు తీర్మానించింది. సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల ప్రజల అభిమతానికి అనుగుణంగా రెండో సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తామని, అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సదస్సులో పాల్గొన్నవారంతా మద్దతు తెలపడంతో…