ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో సవరణలపై కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను బలహీనపరిచే కుట్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఈ దుస్సాహసం, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని దెబ్బతీయడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. వాటిని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఖర్గే అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు.. ఎన్నికల…