రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇండియా నుండి వచ్చే వారిని రానివ్వటం లేదు అని భట్టి విక్రమార్క సీఎల్పీ నేత అన్నారు. గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్తారు. ఇంట్లో దీపం ఆర్పేసి భయట దీపాలు పెట్టండి అంటారు. వ్యాక్సిన్ కూడా లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉంది అని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణం సీఎం కేసీఆరే కారణం. కరోనా దెబ్బ తిన్న కుటుంబాలకు…
రాష్ట్రంలో కరోనాకు, బ్లాక్ ఫంగస్కు పూర్తిగా ఉచిత చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హైదరాబాద్లోని గాంధి భవన్లో సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల భట్టితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని..లెఫ్ట్ భావజాలాలు ఉండి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడో తెలియదని చురకలు అంటించారు. కేంద్ర రక్షణ కోసం ఈటల బీజేపీ వైపు వెళ్ళారని..ఎవరు అధికారంలో ఉంటే అటు పోవడం నాయకులకు అలవాటు అయ్యిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని.. సాగర్ లో ఎన్ని ఓట్లు వచ్చాయని నిలదీశారు. తెలంగాణలో ఇంత గలిజు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని..ఇలాంటి…
కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడు సమావేశాలు అన్నీ జూమ్కు పరిమితం అయ్యాయి.. ఇక, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై ను కలిసి.. వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్లను కలిసి వినతిపత్రం…
కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిని నాశనం చేసి.. కాంగ్రెస్ లోకి వచ్చాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇతర పార్టీ ల నుండి వచ్చిన వాళ్లకు పిసిసి ఇస్తా అంటే ఎలా.. పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే..పార్టీ జైలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తనను తిట్టిన వాళ్ళు లేరు..మూడు,నాలుగు పార్టీలు మారిన వాళ్ళు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద…
టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు భట్టి విక్రమార్క. ఆరేళ్లలో ఆరు కోట్లు అప్పు చేసింది తెరాస. ఈటల నన్ను కలిసినప్పుడు జరుగుతున్న అవమానం పై అన్ని పార్టీల కలుస్తా అన్నారు. కేంద్రంతో రక్షణ పొందుదాం అని బీజేపీ లోకి కొందరు వెళ్తున్నారు. టీఆర్ఎస్ తో పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ కి ఫిర్యాదులు చేశాం. మా పిటిషన్ పెండింగ్ లో పెట్టీ..12 మంది పార్టీ…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు ఇవాళ ప్రగతి భవన్ కు వచ్చారు. తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్బంగా హన్మంతరావు మాట్లాడారు. కరోనాతో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వబోడని…సమస్యలపైన సీఎంకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని ఫైర్…
కరోనా సెకండ్ వేవ్ భారత్లో కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఇది భారత్ కోవిడ్ వేరియంట్ అంటూ కథనాలు వచ్చాయి.. చాలా మంది నేతలు విమర్శలు చేశారు.. అయితే, ఈ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది.. అంతేకాదు.. అది భారత్ వేరియంట్ అంటూ ఉండే కంటెంట్ మొత్తం తొలగించాలంటూ.. అన్ని సోషల్ మీడియా సంస్థలను కోరింది. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని,…
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్ ఆస్పత్రులు కనికరం చూపడంలేదు.. అందినకాడికి దండుకునే ప్రయత్నమే తప్పితే.. జాలిచూపే పరిస్థితిలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్న ఆయన.. ఆంద్రప్రదేశ్,…
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. మాల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి…నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స…