పార్టీలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిపై రచ్చ…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీసీసీలో పంచాయితీలు.. మహిళా కాంగ్రెస్‌లో సిగపట్లు. కాంగ్రెస్ కల్చర్‌లో ఇది కామన్. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ చీఫ్ పోస్ట్‌కంటే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిపై ఎక్కువ రచ్చ అవుతోంది. కమిటీ కూర్పు కొలిక్కివస్తున్నా.. ఆపేవాళ్లు తెరవెనక చురుగ్గానే పావులు కదుపుతున్నారట.
ధరలు పెరిగినా.. మహిళా కాంగ్రెస్ సైలెంట్!
Also Read
- OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
- Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం జటిలంగా మారినట్టే.. మహిళా కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా కయ్యాలు ఓ రేంజ్లో సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి మహిళా కాంగ్రెస్ కమిటీ అచేతన స్థితిలో ఉంది. కార్యక్రమాలు లేవు. కార్యకర్తలు కూడా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. నిత్యవసరాలతోపాటు వంటగ్యాస్ దరలు పెరిగాయి. వీటిపై మాట్లాడిన మాహిళా కాంగ్రెస్ నాయకులే లేరు.
మహిళా కాంగ్రెస్ కొత్త కమిటీపై కసరత్తు
ఆ మధ్య ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తే.. తమకు సమాచారం ఇవ్వలేదని మహిళా కాంగ్రెస్ నాయకులు రచ్చ రచ్చ చేశారు. షర్మిల పార్టీలో చేరిన ఇందిరా శోభన్.. మహిళా ప్రెసిడెంట్‌తో పడకే వెళ్లారని టాక్. గాంధీభవన్ ముందు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ కొత్త కమిటీ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. కొత్త చీఫ్ నియామకం కొలిక్కి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నియామకం కూడా పీసీసీ పంచాయితీలాగే తయారైందట.
నేషనల్ ప్రెసిడెంట్ సుశ్మితదేవ్ పరిశీలనలో పేర్లు
మహిళా కాంగ్రెస్ పదవి నియామకం కోసం జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మిత దేవ్కసరత్తు మొదలు పెట్టారు. పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావు, భవానీరెడ్డి, ఇందిరారావు, గండ్ర సుజాత పేర్లు పరిశీలించారట. వీరిని రెండు, మూడు రోజులుగా సుశ్మిత దేవ్ ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారట. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా.. సునీతారావు పేరు దాదాపుగా ఖరారైందట. అయితే మహిళా కాంగ్రెస్ పరిశీలన కోసం పంపిన జాబితాపై పంచాయితీ నడుస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన భవానిరెడ్డి పేరును పరిశీలనకు పంపడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట మహిళా నాయకులు.
సునీతారావు పేరును ఫైనల్ చేశారని ప్రచారం!
పీసీసీ చీఫ్ నియామకం విషయంలో కొత్త వారికి ఎలా పదవి ఇస్తారని సీనియర్లు గళం ఎత్తుతున్న సమయంలో.. మహిళా కాంగ్రెస్‌కు వచ్చేసరికి ఆ రూల్ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారట. ఇదే విషయమై మహిళా నేతలు ఒకరిపై ఒకరు కయ్‌మంటున్నారు. సిగపట్లుకు సిద్ధపడుతున్నారు. అయితే తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి నియామకం విషయంలో హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చేసిందని చెబుతున్నారు. NSUIతోపాటు యూత్ కాంగ్రెస్‌లో పనిచేసి.. ప్రస్తుతం అడ్వకేట్‌గా ఉన్న సునీతారావును ఫైనల్ చేశారని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా ఆమె పేరును సిఫారసు చేశారట.
సునీతారావు పేరుకు పలువురు అభ్యంతరం!
పార్టీతోపాటు.. మహిళా కాంగ్రెస్‌ను పటిష్టం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆర్థిక సమస్యలు.. అజెండా వంటి అంశాలపై సునీతారావు నుంచి హైకమాండ్ కొంత క్లారిటీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అవి కొలిక్కి రాగానే కమిటీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే.. సునీతారావు అంటే గిట్టని వారు.. ఆమె నియామకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. పీసీసీ కమిటీలా మహిళా కాంగ్రెస్ కమిటీ కూర్పును నాన్చుతారో… తేల్చుతారో చూడాలి.
తాజావార్తలు
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!