సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది.. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. ఆయనకు అభినందనలు తెలిపారు.. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోత్కుపల్లి.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా…
సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాట్టు బీజేపీ ప్రకటించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు.. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ నిర్ణయంపై మోత్కుపలి కి…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11:30 లకు అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ కి టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యులు చేశారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో.. ప్రభుత్వాలది, చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని.. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని చెప్పారు. అందుకు బాధ్యులు పాలకులే అవుతారని సీఎం కెసిఆర్ తెలిపారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది… సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియర్ దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులకు ఆహ్వానాలు వెళ్లగా.. ఈ సమావేశానిక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం,…
చాలారోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అడిగిన వాటన్నిటికీ ఓకే చెప్పేశారు కూడా. ఆ భేటీ ముగిసిన వెంటనే.. కాంగ్రెస్ నాయకుల చుట్టూ విమర్శల జడివాన ముసురుకుంది. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు నేతల ఉన్నాయట. ఏడేళ్ల తర్వాత సీఎం ఎందుకు పిలిచారో ఆలోచించలేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ప్రగతి భవన్‌కి వెళ్లడం పార్టీలో వివాదంగా మారుతోంది. సీఎం కేసీఆర్‌తో భేటీని వ్యూహం కాదు.. వ్యూహాత్మక తప్పిదమన్నది కొందరు నేతల…
తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి ఇవాళ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో ప్రారంభం కానున్న అఖిల పక్ష సమావేశం సుధీర్ఘంగా సాగనున్నది. read also :…
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై పంచాయతీ మొదలైంది. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడ్డారు నేతలు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ పై కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణయానికి వచ్చి తాజాగా పీసీసీ అలాగే ఇతర కమిటీలను ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు, లాకప్ డెత్ లు పెరిగాయి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోలీస్ ల దెబ్బలకు తట్టుకోలేక మరియమ్మ మరణించింది. దీని పై మేము గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. దళితుల మీద దాడులు చేస్తూ సమావేశానికి రమ్మంటే ఎందుకు రావాలని నిలదీశాను.. దాంతో సీఎం మమ్మల్ని కలవడానికి అవకాశం…
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. దళిత అవేదన దీక్ష తర్వాత కలిసిన కాంగ్రెస్ నేతలు.. నిన్న సీఎం తో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అవ్వడం పై మాట్లాడుతూ… దీని పై సోషల్ మీడియా లో తప్పుగా ట్రోల్ అవుతుందని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారం పై జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. సమస్యలు సీఎం కి కాకుంటే ఇంకా ఎవరికి చెప్తాం అని అన్నారు. మేము కలిసింది…
మరియమ్మ లాకప్ డెత్ చాలా దురదృష్టకరం అని అన్నారు ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్. మరియమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. అప్పుడు కనీసం మహిళ పోలీసులు లేరు సిగ్గుచేటు. లాకప్ డెత్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. మరి మరియమ్మ బతికి వస్తుందా అని అడిగారు. రాబోయే ఎన్నికలలో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. మరియమ్మ సంఘటన చాలా దుఃఖం…