చేతి (కాంగ్రెస్ పార్టీ) దెబ్బకు కారు (టీఆర్ఎస్), పువ్వు (బీజేపీ) పల్టీ కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. ధరల పెరుగుదలపై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయాలని సూచించారు.. సీఎం కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయిన మధు యాష్కీ..…
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌కు చీఫ్. అక్కడ పార్టీకి పెద్ద అయినా.. కేడర్‌తో అంతులేని గ్యాప్ ఉందట. ఇప్పుడు అది కాస్తా ఓపెన్ అయిపోయింది. నేరుగా పీసీసీ చీఫ్‌కే ఫిర్యాదులు చేసేవరకు వెళ్లిందట. దీంతో పార్టీవర్గాల్లో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై వ్యతిరేకవర్గం గుర్రు! తూముకుంట నర్సారెడ్డి. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి కాంగ్రెస్…
మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే ముఖ్యమంత్రిగా వుంటారు అని స్పష్టం చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.. బీజేపీ వాళ్లు పగటి కలలు కంటున్నారు.. అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమైన…
సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. అధికార బిజేపి ని దీటుగా ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల…
దేశంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈరోజు వివిధ పార్టీలతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు ఆహ్వానించారు. తృణమూల్‌తో సహా వివిధ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఆప్, ఆకాళిదళ్ పార్టీలకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ రెండు పార్టీలు మినహా మిగతా విపక్షపార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వేయాల్సిన అడుగులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. Read:…
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ టూర్‌కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లో లేదా మహబూబాబాద్‌లో రాహుల్ సభ ఉంటుందని టీ పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 17న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి డేట్ మారే అవకాశం ఉందని తెలంగాణ పీసీసీ నేతలు చెప్తున్నారు. Read Also :…
దళిత బంధు కింద కేసీఆర్ ఇస్తామని చెప్తున్న 10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదు అని చెప్పిన భట్టి విక్రమార్క ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక భాగం మాత్రమే అన్నారు. దీన్ని ఏదో ఒక్క నియోజక వర్గంలో పరిమితం చేయొద్దు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలి అని తెలిపారు భట్టి. కో ఆర్డినెటర్లు నియోజక వర్గాలలో ఈ విషయాలను బాగా విస్తృత ప్రచారం చేయాలి అని సూచించారు. నియోజక…
ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపాడు. డీసీసీలు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలి. ఈ విషయంలో సామాజిక కోణం ఉంది. నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయాలి. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది. 119 నియోజక వర్గాలకు ఇంచార్జి కు…
మనసులు మారుతున్నాయా? పాత స్నేహాలు నెమరేసుకుంటున్నారా? కొత్త సమీకరణాలకు సరికొత్తగా తెర లేస్తోందా? ఉమ్మడి శత్రువుపైకి కలిసికట్టుగా దండెత్తబోతున్నారా? ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులకు ఈ కలయికలు సంకేతామా.? అంతా ఏకమయ్యే అజెండాపై ప్రతిపక్షాలు ఫోకస్? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిందే.. ఈ మధ్య అందరూ చూస్తోందే. ఏపీలో అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ చేతిలో కకావికలమైన విపక్షాలు ఒకే గూటికి…
హుజురాబాద్‌లో ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేనా? ఆలస్యమయ్యే కొద్దీ ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం? జరుగుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్‌పై మూడు ప్రధాన పార్టీల ఫోకస్! మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌కు ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా రాలేదు. కానీ.. రాజకీయాన్ని రంజుగా మార్చాయి పార్టీలు. గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే అక్కడ…