చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు వైద్యులు.