ఇప్పుడు మునుగోడు బై పోల్ పై దృష్టి పెట్టారు బెట్టింగ్ రాయుళ్లు.. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని.. ఓ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ జరుగుతుందని.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. దీనిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన బెట్టింగ్ రాయుళ్లు.. మునుగోడులో గెలుపెవరిది? అంటూ బెట్టింగ్లు కాస్తున్నారు..
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ... అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు.
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి తెరపడనుంది. నేటితో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగయనుంది. సాయంత్రం 6గంటలకు ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.
నేడు హైదరాబాద్లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ సిటీలోకి ప్రవేశించింది.
నలుగురు ఎమ్మెల్యేలు నీతిమంతులైతే ప్రగతి భవన్ లో ఎందుకు దాచిపెట్టినట్టని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. నిన్న కేసీఆర్ సభపెట్టి పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణ తప్ప అందులో ఏమి లేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని తెలిపారు.
RSS Is Real Coffee, BJP Just The Froth Says Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ-ఆర్ఎస్ఎస్ బంధాన్ని కాఫీ కప్ తో పోల్చారు. ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే.. దానిపై నురగలాంటిది బీజేపీ అని అన్నారు. బీహార్ రాష్ట్రంలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని లారియా వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కాంగ్రెస్ పునరుద్ధరించడం ద్వారానే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని గ్రహించడానికి తనకు చాలా…