ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించనుంది. ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు.
S Jaishankar:పాశ్యాత్య దేశాలకు మరోసారి తలంటారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత వైఖరిని తప్పుబడుతున్న సమయంలో వారికి సరైన పాఠం నేర్పారు జైశంకర్. ఇదిలా ఉంటే మరోసారి పాశ్చాత్య దేశాల వైఖరిని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ విషయంలో పలు విదేశాలు స్పందించడంపై ‘‘ బ్యాడ్ హ్యాబిట్’’ అంటూ ఘాటుగా స్పందించారు.
Congress Files: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో పాటు వరసగా ప్రధాన రాష్ట్రాలు అయిన కర్ణాటక, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరగుపల్లిలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తనను కించపరిచేందుకు దేశం లోపల, బయట వ్యక్తులు కుమక్కై పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ శిక్ష, అనర్హత తర్వాత పలు దేశాలు స్పందించడం, యూకే, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నామని చెప్పడం తర్వాత ప్రధాని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్-న్యూ ఢిల్లీల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్…
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్ ట్రైన్ ను శనివారం ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటి వరకు 10 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన ట్రైన్ పదకొండోది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఇదిలా ఉంటే…