Pallam Raju: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. అయితే, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు మార్గం సుగమం చేస్తోంది.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, ఏపీ సీనియర్ నేత పల్లంరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కర్నాటక కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేసి…
Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
Leaders' reaction to BJP's defeat: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం దిశగా సాగుతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 137 స్థానాల్లో విజయం దాదాపుగా ఖరారు అయింది. బీజేపీ కేవలం 63 స్థానాలకు, జేడీఎస్ 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
DK Shivakumar: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం వైపు వెళ్తోంది. మెజారిటీ మార్కును దాటేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 138 స్థానాల్లో, బీజేపీ 63, జేడీఎస్ 20 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ విజయంపై కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. కర్ణాటక ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ద్వేషంతో చేసే రాజకీయాలు ముగిశాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమతో విజయం సాధించామని అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ద్వేషం యొక్క మార్కెట్ మూసివేయబడింది మరియు ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయి" అని ఆయన అన్నారు.
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. 139 స్థానాల్లో ఇప్పటికే లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య అన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ 2024లో ప్రధాని అవుతారని కాంగ్రెస్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం వరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయం తెలుస్తుంది.
కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తది అని ఆయన కామెంట్స్ చేశారు.