Revanth reddy: తలసానికి అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా అన్నాడు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారని ఎద్దేవ చేశారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని వ్యంగాస్త్రం వేశారు. అరతిపళ్ల బండిదగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్ లు నమిలే వారు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా…
జేడీఎస్ ఎన్నికల అనంతర పొత్తును కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రద్దు చేశారు. తమ పార్టీకి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "జేడీఎస్తో పొత్తుకు అవకాశం లేదు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము." అని శివకుమార్ కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు.
Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిల్ పైలెట్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అవినీతి సమస్యలపై సచిన్ పైలట్ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు మే 11న ‘జన్ సంఘర్ష్ యాత్ర’ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం గెహ్లాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియాగాంధీ కాదని, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అని…
రాష్ట్రంలో పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. పేదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను ఈ సర్కార్ దోపిడి చేస్తుందని ఆయ విమర్శించారు.
Karnataka Elections: కర్ణాటకలో 20 రోజులుగా సాగిన ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ర్యాలీలు, రోడ్ షోలకు తెరపడింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. అందుకే ఆఖరి పంచ్ ఐటీ సిటీలో ఇచ్చాయి ప్రధాన పార్టీలు. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా…