కాంగ్రెస్ శ్వేత పత్రానికి కౌంటర్‌గా మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రం ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం 42 పేజీల శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనికి కౌంటర్‌గా తాజాగా కేటీఆర్ స్వేద…
గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే సమయంలో ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. MIM కి గంటల తరబడి సమయం ఇచ్చారు… 8…
గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచాం. అందుకే గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశాం. గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయి. శ్వేత పత్రాలు నిజమేనని,…
అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ అంశంపై చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను మీడియా ముందు జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసి బోర్లా పడిందని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన…