అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ అంశంపై చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను మీడియా ముందు జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసి బోర్లా పడిందని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో ఉన్న దాని మీద చర్చ జరగాలని మేం కోరాం. కానీ శ్వేత పత్రంలో ఉన్న లెక్కల్లోనే చాలా తేడాలు ఉన్నాయి. అధికార పక్ష నాయకులు ప్రతి పక్ష నాయకులను భయపెట్టే ప్రయత్నం చేశారు.
Also Read: Merugu Nagarjuna: వైఎస్ కుటుంబానికి మాత్రమే పాదయాత్రపై పేటెంట్..!
గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేసింది. 22 వేల కోట్ల అప్పులు ఉన్న సమయంలో అనాడు మేము ప్రభుత్వంలోకి వచ్చాం. విద్యుత్ కి సంబంధించిన అప్పులు గురించి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. నష్టం వచ్చినా సరే ప్రజల కోసం రిస్క్ తీసుకోక తప్పదు. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం 24 గంటల కరెంట్‌ను ఇచ్చాం. పరిశ్రమలకు, వ్యవసాయానికి అవసరాల తగ్గట్టు 24 గంటల కరెంట్ ఇచ్చాం. 2014 కు ముందు 3 , 4 గంటలు కరెంట్ కూడా వచ్చేది కాదు. దేశాన్ని 50 ఏళ్ల పైగా పాలించింది కాంగ్రెస్. కానీ ఏ రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులకు సంబంధించి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి.
Also Read: Revanth vs Akbaruddin: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. నేతల మధ్య మాటల తూటాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ట్రాన్స్ మిషన్ వ్యవస్థ లేదు. గతంలో కాంగ్రెస్ చేసిన అప్పు, మేము చేసిన అప్పు సమానంగానే ఉన్నాయి. ప్రతి పక్షం అడిగిన వారికి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ట్రాన్స్ కో జెన్ కో అధికారులను.. ఆ సంస్థను ప్రభుత్వం అవమాన పరిచింది. అలాగే శ్రీశైలం విషయంలో కూడా అబద్ధాలు మాట్లాడారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు మేమందరం వెళ్లి అక్కడ చనిపోయిన వారిని వాళ్ళ స్వస్థలానికి పంపించి, ఆ కుటుంబాలను ఆదుకున్నాం’ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ మాట్లాడారు. సిద్ధిపేట, గజ్వేల్ విద్యుత్ మొండి బకాయిలపై సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై ఆయన స్పందించారు. సిద్దిపేట, గజ్వేల్, ఇరిగేషన్ ప్రాజెక్టుల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, వాటిని ప్రజల కట్టే కరెంట్ బిల్లులుగా మాట్లాడుతున్నారన్నారు.