పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఈ మేరకు గ్యాస్ సిలిండర్‌కు దండలు వేసి డప్పులు కొడుతూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం…