కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై చర్చించారు. అంతేకాకుండా 2023లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హుజుర్ నగర్, కోదాడ ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం మాఫియాలో మునిగితేలుతున్నారని, వచ్చే ఎన్నికల్లో హుజుర్ నగర్, కోదాడలో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ఏడాది తరువాత టీఆర్‌ఎస్ పీడ వదులుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి బల్మూరి వెంకట్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలే కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని, తెలంగాణాలో ఒకరినొకరు తిట్టుకొని ఢిల్లీలో కలుస్తున్నారన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌కు దళిత బంధు ఇచ్చే అలోచన లేదని, అది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తరువాత…