Karnataka Cabinet Expansion: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రచ్చ మొదలైంది. నిన్నటి నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చీలిక అనేక మలుపులు తిరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్లు ఒక్కటయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ లక్ష్యంగా ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి.. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఇది సహజమైన చర్యే. దీనికితోడు వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో అధిష్ఠానం కూడా దిద్దుబాటు చర్యలకు దిగాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ ప్రజలు మొత్తం ఉత్కంఠగా ఎదురుచూశారు.. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరా జరిగినా.. ఈటలకు భారీ మెజార్టీయే దక్కింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బై పోల్‌లో చతికిలపడిపోయింది.. అయితే, గత ఎన్నికల్లో 60…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యంపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 13న ఢిల్లీ రావాలని పీసీసీ అధ్యక్షుడు సహా సుమారు 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది. హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ స్థాయిలో సమీక్షించనున్నట్లు సమాచారం. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే రావడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓట్ల శాతం…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది.. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.. అంతే కాదు.. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్‌గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్ ఆదేశించినట్టు తెలుస్తుంది… ఏఐసీసీ కార్యదర్శి బోస్…