Nagarjuna Akkineni: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్..!
- ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్..
- చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎలాంటి కట్టడాలు చేపట్టలేదు..
- కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే నేనే కూల్చేవాడిని: నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Akkineni: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను కొనసాగించింది. ఈ కూల్చివేతపై నాగార్జున తొలి సారి స్పందించారు.. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం.. మా ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను అని అక్కినేని నాగార్జున తెలిపారు.
Read Also: Karthikeya2: పీపుల్స్ మీడియా అవార్డు విన్నింగ్ సెలెబ్రేషన్స్..
Also Read
ఇక, ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది అని టాలీవుడ్ కింగ్ నాగార్జున తెలిపారు. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు.. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని.. తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది.. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని అక్కినేని నాగార్జున వెల్లడించారు.
స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 24, 2024
తాజావార్తలు
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!