హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
హైడ్రా కూల్చివేతలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయా? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతోందా? పాతబస్తీలో చెరువుల ఆక్రమణలు, ఎంఐఎం అక్రమ నిర్మాణాల సంగతేంటని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం జరుగుతోందా? అసలు కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.
సింగరేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, సమర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఇక పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు.. కేంద్రం ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగాను దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ఇంకా మార్పు కనిపించడం లేదు.
ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు.
పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్’లో చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం దాన్ని తొలగించారు.
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగోతో ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు.
ప్రైవేటు రంగంలోని సీ, డీ కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును పునఃపరిశీలించనుంది.