కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని.. సురేఖపై ఎవరో ట్రోల్ చేస్తే అది బీఆర్‌ఎస్‌కు అపాది స్తున్నారని.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ ట్రోల్‌ను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. ట్రోల్‌లో ఎక్కువ మంది చూడలేదని.. కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ ఫొటో చూపిస్తేనే అందరికీ తెలిసిందన్నారు. రాజకీయాల్లో ఉండే వాళ్లకు ధైర్యం ఎక్కువ ఉండాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలు అందరూ బాధ పడే విధంగా మాట్లాడారన్నారు.
READ MORE: Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి బందరు పోర్టును ప్రారంభిస్తాం..
ఆమె కూడా సినిమా తీసిందని.. ఆమెకు కూడా సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయన్నారు. తన మీద పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తామన్నారు. “ఎవరి ఇంట్లో ఎవరు ఉన్నది మీకు ఎలా తెల్సింది.. మీరు పక్కన ఉన్నారా? ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజు మేము చీరలు ఇచ్చాం. మీరు బజారు మాటలు మాట్లాడు తున్నారు.” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
READ MORE:Jharkhand: జార్ఖండ్‌లో దుండగుల దుశ్చర్య.. రైల్వే ట్రాక్ పేల్చివేత
ఇటీవలబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు మనసున్నానిషిగా స్పందించారు. నివేందుకు రియాక్టు కాలేదు.. మనిషివి కాదా.. పశువు వా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.