Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tharun Bhascker: సాధారణంగా ఎప్పుడూ కూల్‌గా, తన పని తాను చేసుకుంటూ పోయే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈసారి మాత్రం మాస్ అవతారం ఎత్తారు. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సందర్భంగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తనను తక్కువ అంచనా వేస్తున్న ఇండస్ట్రీ వర్గాలకు గట్టి కౌంటర్ ఇస్తూ.. ఇకపై తన రూట్ మారుస్తున్నానని, “డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు” అంటూ తరుణ్ భాస్కర్ చేసిన సంచలన ప్రకటన ఆడిటోరియాన్ని షేక్ చేసింది.
ఇన్నాళ్లూ కంటెంట్, నిజాయితీ అంటూ కేవలం ఒకే తరహా సినిమాలపై దృష్టి పెట్టిన తరుణ్, ఇకపై తన పంథా మార్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. “ఇన్ని సినిమాల్లో డబ్బు వెంట పరిగెత్తొద్దు అని చెప్పాను. కానీ ఇప్పటి నుంచి నేను డబ్బునే ఫాలో అవుతాను. ఎందుకంటే అందరూ లైన్లో నిలబడాలి. నెక్స్ట్ సినిమా నుంచి A, B, C సెంటర్లన్నింటినీ కొట్టే కమర్షియల్ బొమ్మలు తీస్తాను. ఒక నిజాయితీ గల గొంతుక ఎంత దూరం వెళ్తుందో చూపిస్తా. ఇప్పటినుంచి డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు” అని తరుణ్ తేల్చిచెప్పారు. ఇండస్ట్రీలో తనకు ఎవరి అండదండలు లేవని చెబుతూ.. “నేను మోకాళ్ల మీద పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడం అని పిలవను. నాకు జనమే బలం. రజనీకాంత్ డైలాగ్ లాగా నాకు మీరు ఉన్నారు. మేము కల్తీ లేని ప్రేమను ఇస్తూనే ఉంటాం.. ఎవడు ఆపుతాడో చూసుకుంటాను” అంటూ ఆయన విసిరిన ఛాలెంజ్ అభిమానుల్లో పూనకాలు తెప్పించింది.
Also Read
- Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
- Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
- Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
- RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
తన ఎదుగుదలకు కారణమైన ప్రేక్షకులకు తరుణ్ భాస్కర్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. “బయట అందరూ లెక్కలు చూసుకుంటారు, కానీ మీరు మాత్రం ఎలాంటి లెక్కలు లేకుండా నన్ను ప్రేమించారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, నా కులం ఏంటి అని ఏదీ చూడకుండా.. మారేడ్‌పల్లిలో ఉన్న ఒక కుర్రాడిని పట్టుకుని ఆంధ్రా, తెలంగాణలో ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే అది కేవలం సినిమాపై మీకున్న ప్రేమ మాత్రమే. జూబ్లీహిల్స్ నుంచే రానక్కర్లేదు, ఎక్కడి నుంచి వచ్చినా కంటెంట్ ఉంటే నెత్తిన పెట్టుకుంటామని మీరు నిరూపించారు” అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన కొత్త నటీనటులు మధురిమ, శివాత్మిక, సీనియర్ జర్నలిస్ట్ రామ్, కరుణ కుమార్, శ్రీరామచంద్రలకు తరుణ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన డైరెక్షన్ టీమ్‌కు సరైన పారితోషికం ఇచ్చిన నిర్మాతలు సృజన్, సందీప్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. “డైరెక్షన్ టీమ్ అంటే కూలి పని కాదు.. చదువుకుని, ఇష్టంతో చేసే పని. వాళ్లకు సరైన గౌరవం, డబ్బు ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకు హ్యాట్సాఫ్” అన్నారు. చివరగా ‘ఈఎన్ఈ మీమ్ ప్రాజెక్ట్’ అఖిల్‌ను స్టేజీపైకి పిలిచి, నేటి కాలంలో మీమర్స్, కంటెంట్ క్రియేటర్ల శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని తరుణ్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
-
Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!
-
Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
-
Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!