Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు
- కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు
- అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు
- విభజన నాటి పరిణామాలను గుర్తుచేసిన డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ బాధ్యతగా విభజించలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకసారి చంద్రబాబును కలిశానని.. అప్పుడు ఒకే మాట చెప్పారని.. టెంట్ వేసుకునైనా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేద్దామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. అందుకోసమే 2014లో ఎలాంటి కండీషన్స్ లేకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు చేతిలో రాష్ట్రం ఉంటే బాగుంటుందనే సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్లుగా తెలిపారు.
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
‘‘వాస్తవంగా చెప్పాలంటే.. భూ సమీకరణ చేయడమంటే చాలా కష్టం.. చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది రాజధాని కోసం ఎలాంటి గొడవలు లేకుండా భూములు సేకరించారు. అంతేకాకుండా భూమిలిచ్చిన వారందరికీ న్యాయం చేశారు. ఇక 2019లో ప్రభుత్వం మారినప్పుడు రాజధానిపై ఎన్ని అభండాలు వేశారో అందరికీ తెలిసిందే. గత పాలనలో మహిళా రైతులను దారుణంగా కొట్టారని.. ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్లంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. గత పాలనలో ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉండేదని.. చట్టసభల్లోనూ దాడులు జరిగేవని.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకే రక్షణ లేదు.’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదు. తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు అనే భావన మాకు ఎప్పుడూ లేదు. తెలుగు నేల అనే భావన ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేవు. చంద్రబాబు బలమైన ఆశావాది కాబట్టి.. ఆఫీసులు లేకపోయినా పనిచేశారు.’’ అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు
తాజావార్తలు
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
ట్రెండింగ్
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!