ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్ పై కరాటే కళ్యాణి దాడి చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఆవీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ కావడంతో.. ఓరేంజ్ లో చర్చకు దారితీసింది. కరాటే కళ్యాణి శ్రీకాంత్ పై శ్రీకాంత్ కరాటే కళ్యాణిపై ఒకరి పై మరొకరు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టారు అధికారులు. కరాటే కళ్యాణి దగ్గర వున్న దత్తత తీసుకున్న పాపపై కేసు మలుపుతిరిగింది. ఎలా దత్తత తీసుకున్నారు అంటూ ఇంటి వరకు విచారణకు…
ఈమధ్యే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు మంత్రి కేటీఆర్. తన కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బంజారా హిల్స్ ఏసీపీకి టీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై ట్విటర్‌లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్‌ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. మల్లన్న ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ ఖండించారు. బీజేపీ మీడియా నాయకులు…
ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి…
ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే కర్నూలు మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులపై దాడిపై ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు చేసారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బేతాలలో కేఈ ప్రభాకర్, కోట్ల సుజాత, గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, తిక్కా రెడ్డి ఉన్నారు. అయితే టీడీపీ నేత తిక్కారెడ్డి పై మూడు సార్లు దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అక్రమాలను అరాచకాలను అడ్డుకుంటున్నందుకే తమ పై దాడి…
పోలీస్ స్టేషన్‌కు కొన్నిసార్లు వింత వింత కేసులు వస్తుంటాయి. ఆ కేసులను చూసి పోలీసులు షాక్ అవుతుంటారు. కోడి కనిపించడం లేదని, కోడి గుడ్డు పెట్టడం లేదనే కేసులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి కర్ణాటకలోని హోలేహోన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని సిద్లాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు నాలుగు ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను ప్రతిరోజు సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లి…
బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే.. మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కాబోయే దంపతులకు షాక్ ఇచ్చారు పలువురు స్థానికులు. కత్రినా- విక్కీలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ లో ప్రఖ్యాతి గాంచిన…
టాలీవుడ్ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు. తనను కొందరు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న స్నేహ చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని తెలిపిన వారు ఇప్పుడు మోసం చేశారని…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పాలనపై పట్టు తప్పుతోంది. మెడికల్ విద్యార్థుల మధ్య సమన్వయం చేస్తూ ఉత్తమ బోధన చేయాల్సిన ప్రొఫెసర్లు అధిపత్యపోరులో మునిగి తేలుతుండడంతో మెడికల్ విద్యార్థుల్లో వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి.. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య ఏకంగా గొడవ చోటు చేసుకుంది. కేఎంసీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య గొడవ చోటుచేసుకుంది. హాస్టల్-1లో సీనియర్ల అనుచిత ప్రవర్తన పైన మోదీ, కేటీఆర్ కు ట్వీట్ చేశాడో…
‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్, కరాటే కల్యాణి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది. ఈమేరకు హేమ…
దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంట నటించగా.. సామాజిక దృక్కోణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. ఇదిలావుంటే, రిపబ్లిక్ సినిమాపై ప.గో జిల్లా, కొల్లేరు గ్రామాల వాసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నాం అని మా గ్రామాలపై దుష్ప్రచారం చేశారు. కొల్లేరు వాసుల…