ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. లాంగ్‌జంప్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు క్వాలిఫికేషన్ రౌండ్ల నుంచి ఫైనల్‌కు చేరుకున్నారు. భారత అథ్లెట్లు మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్ యాహియా పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు.
బర్మింగ్ హామ్ వేదికగా.. కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమమంలో.. క్రీడల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి అదుపుతప్పి కిందపడడ్డారు.. దీంతో వెనుకనుండి వస్తున్న ప్రత్యర్థి న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా సైకిల్ మీనాక్షి పై నుంచి దూసుకెళ్లడంతో.. తీవ్రంగా గాయపడింది. అక్కడున్న పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ర్టెచర్ పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. read…
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. నాలుగో రోజున మూడు మెడల్స్ భారత్ ఖాతాలో చేరాయి. ఓ రజతం సహా రెండు కాంస్యాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. మహిళల జూడో 48 కేజీల విభాగంలో సుశీలా దేవి రజతం కైవసం చేసుకుంది. అటు పురుషుల జూడో 60 కేజీల విభాగంలో విజయ్ కుమార్ యాదవ్, వెయిట్ లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ కాంస్య పతకాలను దక్కించుకున్నారు. దీంతో…
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లోనే మూడు స్వర్ణాలు దక్కటం విశేషం. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటుతున్నారు. ఈ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు స్వర్ణాలు భారత్ తన ఖాతాలో వేసుకోగా.. ఆ మూడు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చినవే కావడం గమనార్హం.
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా నిర్వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. 100 కోట్ల మందికి పైగా భారతీయులను సంతోషంలో ముంచెత్తింది. ఆదివారం జరిగిన మహిళల టీ20లో దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సుల…
Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళల క్రికెట్ పోటీలలో భాగంగా ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి కారణంగా ఈ మ్యాచ్‌ను 18 ఓవర్లకు…
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో మన దేశానికి మరో గోల్డ్ మెడల్ వచ్చింది. మరోసారి వెయిట్ లిఫ్టింగ్‌లోనే భారత్ పతకం సాధించింది. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినంగ్ మొత్తం 300 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం గెలిచాడు. స్నాచ్‌లో 140 కిలోలతో అతడు కామన్వెల్త్ రికార్డు సృష్టించాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 160 కిలోలు మొత్తంగా 300 కిలోలతో సంచలనం సృష్టించాడు. అరంగేట్రంలోనే జెరెమీ…
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్‌లో భాగంగా మహిళ క్రికెట్ పోటీలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ ఆలస్యమవుతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. వరుణుడు శాంతించాక…
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో గురురాజ్ పుజారీ కాంస్యం సాధించాడు. ఈ పోటీల్లో గురురాజ్ పుజారీ 269 కిలోలను ఎత్తి కాంస్యం గెలుచుకున్నాడు. భారత వెయిట్‌లిఫ్టర్ గురురాజ్ తన మొదటి స్నాచ్ ప్రయత్నంలో 114 కేజీలు, రెండోసారి 118 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో గురురాజ్ మూడో ప్రయత్నంలో 151 కిలోల లిఫ్ట్‌తో తన పతకాన్ని ముగించాడు.…