Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో మన దేశానికి మరో గోల్డ్ మెడల్ వచ్చింది. మరోసారి వెయిట్ లిఫ్టింగ్‌లోనే భారత్ పతకం సాధించింది. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినంగ్ మొత్తం 300 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం గెలిచాడు. స్నాచ్‌లో 140 కిలోలతో అతడు కామన్వెల్త్ రికార్డు సృష్టించాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 160 కిలోలు మొత్తంగా 300 కిలోలతో సంచలనం సృష్టించాడు. అరంగేట్రంలోనే జెరెమీ పతకం గెలవడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2022లో మన దేశానికి 5 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. శనివారం మీరాబాయి చాను భారత్‌కు తొలి స్వర్ణం అందించింది.
కాగా ఇండియన్ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ 67 కేజీల కేటగిరీ వెయిట్‌లిప్టింగ్ క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తబోయి నొప్పితో బాధపడ్డాడు. రెండో ప్రయత్నంలో 160 కేజీలను ఎత్తాడు. నొప్పి వేధిస్తున్నా అతడు విజయవంతంగా ఈ బరువు ఎత్తాడు. అయితే క్లీన్ అండ్ జెర్క్ మూడో ప్రయత్నంలో అసలు బరువు ఎత్తలేకపోయాడు. కాస్త వెయిట్ ఎత్తడానికి ప్రయత్నించగానే గాయంతో కిందపడిపోయాడు. దీంతో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కలిపి 300 కేజీల దగ్గర ఆగిపోయాడు. అయితే ఇది కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు కావడం విశేషం.
#CommonwealthGames2022 | Indian weightlifter Jeremy Lalrinnunga wins Gold in Men's 67kg finals. This is India's second gold in Birmingham pic.twitter.com/Q8TAKxyGVM
— ANI (@ANI) July 31, 2022