విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంస నీయమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గమనించి వారిని సరైన దిశలో ప్రోత్సహించడానికి విశ్వగురు అధినేత సత్యవోలు రాంబాబు చేస్తున్న కృషి గొప్పదని ఆయన కొనియాడారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సోమ వారం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా శర్మన్ హాజరయ్యారు. వివిధ…
సికింద్రాబాద్ లోని రసూల్పుర,పికెట్ లోని వ్యాక్సినేషన్ సెంటర్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన ఈ అవకా శాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు తమంతట తాముగా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని, అధికా రులు ప్రజలు వాక్సిన్ వేయించుకునేలా వంద శాతం వాక్సినేటెడ్ నగరంగా హైదరాబాద్‌ను తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను పూర్తి చేశామని వ్యాక్సిన్…