హైదరాబాద్ లో భారీ వర్షాలకు పురాతన, శిథిలావస్థలో వున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. బుధవారం ఓల్డ్ మలక్ పేట్ గంజ్ లోని మహబూబ్ మేన్షన్ ప్యాలెస్ చూస్తుండగానే కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వానలకు ఈ భవనం బాగా నానిపోయింది. చాలా కాలం నుంచి ఈ భవనం పటిష్టతపై అనుమానాలు వస్తూనే వున్నాయి. వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని…