సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది.