అధికారం కాదు.. విలువలు ముఖ్యం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పందించిన ఆయన.. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం అని హితవు పలికారు.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.