జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వడ్డింపు మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. గాంధీ చిత్ర పటానికి…
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన తర్వాత క్రమంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు కూడా రాశారు.. మధ్యప్రదేశ్,…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు.. తాజాగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ.. గత ఏడాదిలోనే టీడీపీకి రాజీనామా చేశారు శోభా హైమావతి.. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..…
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలో సంఖ్య రెట్టింపు కాబోతోంది.. జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెరగబోతోంది.. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.. జిల్లాల పేర్లను కూడా ఖరారు చేసింది.. అయితే, జిల్లాలపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఇచ్చింది.. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటును ఏపీ బీజేపీ స్వాగతించింది.. కొత్త జిల్లా ఏర్పాటుపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. కొత్త జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్నారు.. ఇక, 2014లోనే బీజేపీ ఎన్నికల…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 26 జిల్లాలుగా పునర్విభజించనున్నారు.. ఆయా జిల్లాల పేర్లను కూడా ఖరారు చేశారు.. మరోవైపు.. ఇప్పటికే అనేక సమస్యలపై వరుసగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖలు రాస్తూ వస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ ఓ లేఖ రాశారు.. కొత్త జిల్లాలకు తాను సూచిస్తున్న మూడు పేర్లు పెట్టాలని…
కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. కోవిడ్ దెబ్బకు కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థలు మూతపడ్డాయి.. మరికొన్ని రాష్ట్రాల్లో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నా.. విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి.. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి.. అయితే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారినపపడం ఆందోళనకు గురిచేస్తోంది.. దీనిపై ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విద్యార్థులు,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో లేఖ రాశారు కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం సీఎంకు లేఖలు రాస్తూ వస్తున్న ఆయన.. ఈ సారి ఓటీఎస్ విధానాన్ని తన లేఖలో పేర్కొన్నారు.. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని తన లేఖలో సీఎంను కోరారు ముద్రగడ.. ఇక, గత ప్రభుత్వం…
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది.. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితితో పాటు.. ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఏ సహా పలు అంశాలపై చర్చ సాగగా.. కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ, తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.. కోవిడ్ నివారణా చర్యలను మంత్రివర్గానికి వివరించారు అధికారులు. ఈబీసీ…
చింతామణి నాటకంపై నిషేధం విధించింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం… చింతామణి నాటకం ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందంటూ.. నాటక ప్రదర్శనను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆర్యవైశ్యులు.. దీంతో.. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కడా చింతామని నాటకాన్ని నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హర్షంవ్యక్తం చేశారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య…