మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలను మరో గంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది… మద్యం సేల్స్ అకౌంట్ల నిర్వహణకు మరో గంట సమయాన్ని పెంచినట్టు ప్రభుత్వం పేర్కొంది.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలకు వెసులుబాటు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అధికారులు.. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని.. రాష్ట్రంలో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమే అన్నారు.. సుమారు…
టాలీవుడ్ సమస్యలకు సంబంధించి సీఎం జగన్ తో భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. స్వయంగా సీఎం ఆహ్వానం మేరకే సినిమా బిడ్డగా భేటీకి వచ్చానంటూ చిరంజీవి చెప్పారు. అయితే సీఎం జగన్, చిరంజీవి ఈ లంచ్ భేటీలో అసలేం చర్చించబోతున్నారు ? చాలా రోజులుగా సమస్యలతో సతమతమవుతున్న టాలీవుడ్ కు ఈ భేటీతో ఊరట లభిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపటి క్రితం బేగంపేట నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో విజయవాడకు బయలుదేరిన చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి…
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది అంటూ మండిపడ్డారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీలో మంత్రిగా ఉండి రాజీనామా చేసిన మౌర్య పై ఏడేళ్ల క్రితం పెట్టిన కేసులు బీజేపీ బయటకు తీసి వేధిస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఫైర్ అయ్యారు. ఇక, ధరల నియంత్రణలో బీజేపీ ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శించిన రాఘవులు.. ఎరువుల ధరలు నియంత్రణ పై…
ఇక వైసీపీ అరాచకాల్ని సహించం, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చేయి వేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన… ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో జగన్, పల్నాడులో పిన్నెల్లి హత్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించిన అచ్చెన్నాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు,…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి… త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననే ఈ మధ్యే ప్రకటించిన ఆయన.. ఇప్పుడు తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను అంటూ కామెంట్లు చేసి కొత్త చర్చకు తెరలేపారు.. ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ కృష్ణరాజు ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆయనకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.. ఆ తర్వాత మీడియాతో…
సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చ హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.. రాంగోపాల్ వర్మను పిలిచి భోజనం పెట్టారు.. కానీ, విద్యార్ధుల కడుపు నింపే విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు అని మండిపడ్డారు.. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం…
ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు పేదవాళ్లకు ఇప్పటికే పంపిణీ చేశామని గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఎంఐజీ వెబ్ సైట్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.. మధ్య తరగతి కుటుంబాలకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్ కంటే తక్కువకే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.. ప్రభుత్వమే అభివృద్ధి చేసి, ప్లాట్లను ఇస్తుంది..…