ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలో సంఖ్య రెట్టింపు కాబోతోంది.. జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెరగబోతోంది.. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.. జిల్లాల పేర్లను కూడా ఖరారు చేసింది.. అయితే, జిల్లాలపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఇచ్చింది.. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటును ఏపీ బీజేపీ స్వాగతించింది.. కొత్త జిల్లా ఏర్పాటుపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. కొత్త జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్నారు.. ఇక, 2014లోనే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని ఈ సందర్భంగా తెలిపిన ఆయన.. బీజేపీ ప్రణాళికను నేటి ప్రభుత్వం అమలుపరుస్తోందన్నారు.. దీనిని బట్టి పరిపాలన పట్ల బీజేపీకి ఉన్న దూరదృష్టిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు సోము వీర్రాజు.. మరోవైపు.. రెండేళ్ల క్రితమే మొత్తం 26 మంది జిల్లా అధ్యక్షులను పెట్టి, జిల్లా కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు సోము వీర్రాజు.. అయితే, స్థానికంగా నివశిస్తున్న ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఆయా జిల్లాలకు పేర్లు పెట్టాలని స్పష్టం చేశారు.
Read Also: షాకింగ్ నివేదిక.. ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందంటే..?