ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు, ఇతర సమస్యలపై సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది… మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సూపర్‌స్టార్ మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం వైఎస్ జగన్‌ను కలవడం.. సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలపడం జరిగిపోయాయి.. ఇక, త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా చిరంజీవి ప్రకటించారు.. కానీ, ఇప్పటి వరకు అది కార్యరూపం…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన… వైసీపీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని గుర్తుచేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… హంద్రీనీవా ఆయకట్టు విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన.. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో కాలువ కింద 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని.. కనీసం 50 రోజులు నీటి అవసరం ఉందని తన లేఖ ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు… హెచ్ఎల్సీ నుంచి జీబీసీ, ఇంద్రావతి డీప్ కట్ ద్వారా హంద్రీనీవాకి నీటిని మళ్లించే అవకాశం ఉందని… ఈ విధానంలో…
సినిమా టికెట్లతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా కొనసాగగా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమ తరపున ముందుడి.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు.. ఇక, సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన చర్చించారు.. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కూడా వెళ్లి సమస్యల…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్‌లో…
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆ పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం… మొదట ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని విషయం తెలిసిందే.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.. అయితే, తాజాగా, ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.. అయితే, గౌతమ్ సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి విషయంలో ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. ఐపీఎస్ హోదాలో ఉండగా రాజ్యాంగబద్ద పదవి చేపట్టొచ్చా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతోంది ప్రభుత్వం.. రాజీనామా చేసిన తర్వాతే ఏపీపీఎస్సీ ఛైర్మన్ గిరీ…
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే 51 గ్రా, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుతుండగా.. ఈ ప్రక్రియలు తలెత్తే సవాళ్ల పరిష్కారంపై ఫోకస్ పెడుతోంది సర్కార్.. దీనిలో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను…
ఆదాయ వనరులు పెంచుకోవటంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి మంద్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.. ఎస్‌ఓఆర్ పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించిన ఆయన.. వీటిని కార్యరూపంలోకి తీసుకు రావడంపై దృష్టి పెట్టాలన్నారు.. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లదే క్రియాశీలక పాత్ర…