టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు మంత్రి దాడిశెట్టి రాజా.. తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రౌండ్ రియాలిటీ చంద్రబాబుకు అర్థమైపోయింది.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాడని విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు మాటలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన.. అబద్దాలు చెప్పి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు.. పోలవరం దగ్గర చంద్రబాబు డ్రామా చేశాడని మండిపడ్డారు.. పట్టి సీమ పేరుతో దోచుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. ఇక, పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి పుట్టిన బిడ్డ, ఎవరికో పుట్టిన బిడ్డను నీకు పుట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దత్తపుత్రుడితో కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మీ ఆటలు సాగవని హెచ్చరించారు దాడిశెట్టి రాజా..
Read Also: CM YS Jagan: గొప్పమనసు చాటుకున్న ఏపీ సీఎం.. నేను ఉన్నానంటూ భరోసా..
ఇక, యనమల రామకృష్ణుడు.. చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.. ఇప్పుడు మాత్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే వద్దని లేఖలు రాస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు మంత్రి దాడిశెట్టి రాజా… చంద్రబాబుకే కాదు తెలుగుదేశం వృద్ధ జంబుగాళ్లకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చెప్పుతో కొట్టబోతున్నారనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు, తెలంగాణలో అమర్‌రాజా పెట్టుబడులపై స్పందిస్తూ… విస్తరణ కోసమే అమర్‌రాజా ప్లాంట్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతుందన్నారు మంత్రి దాడిశెట్టి రాజా.. కాగా, నిన్న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో.. పోలవరం మొక్కను నాటింది నేనే.. పోలవరం నా ప్రాణం.. ఎన్నోసార్లు పోలవరాన్ని సందర్శించా.. మరెన్నోమార్లు పనులపై సమీక్షలు నిర్వహించా.. 70 శాతానికి పైగా పోలవరం నిర్మాణం పూర్తిచేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే.