Posani Krishna Murali: తన ఊపిరి పోయే వరకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే ఉంటానని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.. ఇవాళ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, జగన్‌ని దూరం నుంచి చూసి వచ్చానని తెలిపారు.. అయితే, చచ్చే వరకు జగన్‌తోనే ఉంటాను, వైసీపీ జెండామోస్తానని అని ప్రకటించారు పోసానీ కృష్ణ మురళి.. ఇక,…
Anil Kumar Yadav: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీలో కలకలం రేపాయి.. చంద్రబాబు, లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లిన కోటంరెడ్డి.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే, అది ట్యాపింగ్ కాదు.. ఫోన్ రికార్డింగ్ అని కొట్టిపారేస్తున్నారు.. ఇక, ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రాజీనామా సవాల్ విసిరారు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి…
Adala Prabhakara Reddy: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఓవైపు కోటంరెడ్డిపై కౌంటర్ ఎటాక్ చేస్తూనే.. మరోవైపు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దింపింది.. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో…
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీల సంక్షేమం టాప్ గేర్‌లో నడుస్తోంది.. మూడున్నరేళ్లలోనే ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వేదికగా జరిగిన వైసీపీ ముస్లిం మైనార్టీ సదస్సు నిర్వహించారు.. ముస్లిం మైనార్టీ వ్యవహారాల మంత్రి, డిప్యూటీ సీఎం అంజాద్ బాష , మైనారిటీ వర్గ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మైనార్టీలకు అండగా నిలబడి సంక్షేమపాలన అందించిన నేత సీఎం వైఎస్ జగన్ అన్నారు.. గత…
Off The Record: వైసీపీలో అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లుకలుకలు ఓ రేంజ్‌లో రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఆనంను తప్పించి… నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గం వంతు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి…
Nick Vujicic: ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన ఆయన.. సీఎం జగన్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయని, విద్యారంగంలో నమ్మశక్యం కాని పురోగతిని తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు.. గుంటూరుచౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ…
Minister Gudivada Amarnath Open Challenge to Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. నా దగ్గర 600 ఎకరాల భూమి ఉన్నట్టు ఆరోపిస్తున్నారు.. నా దగ్గర అంత భూమి ఉందని నిరూపిస్తే.. ఆ భూమిని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చేస్తానని ప్రకటించారు.. నిరాధారమైన ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ మానుకోవాలని హితవుపలికిన ఆయన.. కాపులను కట్టగట్టి చంద్రబాబుకు అమ్మే ప్రయత్నం పవన్ చేస్తున్నారని విమర్శించారు. ఒక…
GVL Narasimha Rao: విశాఖపట్నం రాజధానిపై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు.. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి విపక్షాలు.. ఆ వ్యాఖ్యలపై స్పందించిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. సీఎం జగన్ వాఖ్యలు వివాదంగా మారాయన్నారు.. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.. రాజధాని అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు రావాల్సి ఉంది.. కానీ, సీఎం వైఎస్ జగన్ ముందే ఎలా ప్రకటిస్తారు? అని నిలదీశారు.. విశాఖ…
Minister Jogi Ramesh: రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనిపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.. సీబీఐ కేసుతో.. విశాఖ రాజధానికి లింక్ పెడుతున్నాయి.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ స్టేట్‌మెంట్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎక్కడా సీఎం…