Anil Kumar Yadav: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీలో కలకలం రేపాయి.. చంద్రబాబు, లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లిన కోటంరెడ్డి.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే, అది ట్యాపింగ్ కాదు.. ఫోన్ రికార్డింగ్ అని కొట్టిపారేస్తున్నారు.. ఇక, ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రాజీనామా సవాల్ విసిరారు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన అనిల్ కుమార్.. మరి, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిరూపిస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని నిలదీశారు.
ఇదే సమయంలో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్న ఆడియో సంభాషణ పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన అనిల్ కుమార్.. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని స్పష్టం చేశారు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తన సవాల్ కు స్వీకరించాలి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖలను తీసుకెని స్పీకర్ దగ్గరకు రావాలి.. నేను కూడా రాజీనామాతో వస్తా.. ఫోన్ ట్యాపింగ్ నిజమని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తాను.. జరగలేదని నిరూపిస్తే కోటంరెడ్డి సిద్ధమా? అని సవాల్ చేశారు.. ఇక, 15 సెకండ్ల ఆడియో విడుదల చేయడం కాదు.. మొత్తం 51 సెకండ్ల ఆడియోను విడుదల చేయాలి… అది రాష్ట్ర ప్రజలు వింటారు.. అందులో మీ ఉద్దేశం ఏంటో తెలిసిపోతుందని.. వెంటనే ఆ పని చేయాలని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ అవకాశం ఇస్తేనే.. నువ్వైనా.. నేనైనా ఎమ్మెల్యేం అయ్యాయం.. జగన్ అనే వ్యక్తి లేకపోతే.. మన పక్కన 70-80 వేల ఓట్లు ఉండబోవన్నారు.. నమ్మకద్రోహం చేస్తే పాపం పిల్లలకు కొడుతుందంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.