Adala Prabhakara Reddy: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఓవైపు కోటంరెడ్డిపై కౌంటర్ ఎటాక్ చేస్తూనే.. మరోవైపు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దింపింది.. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఆదాల నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తారని ప్రకటించారు.. ఈ నియోజకవర్గంలోని తాజా పరిణామాలపై సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు ఎంపీ ఆదాల ప్రభాకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. కోటంరెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Project K: ఓరి బాబో ఆపండ్రా .. ఇక్కడ ఒక్కటే అవ్వలేదు అప్పుడే రెండోదా..?
కోటంరెడ్డి స్థానంలో ఆదాలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.. ఇక నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన బాధ్యతలు ఆదాలకు అప్పజెప్పారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు.. ఇక, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. నన్ను రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించటం సంతోషంగా ఉందన్నారు.. ఈ బాధ్యత ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.. ఎంపీలకు నియోజకవర్గాలపై అంత అవగాహన ఉండదు.. కానీ, ఇప్పుడు క్యాడర్‌కు మనో ధైర్యం చెబుతా అన్నారు.. కోటంరెడ్డితో పార్టీకి లాయల్ గా ఉండే వాళ్లు ఎవరూ వెళ్లరన్న ఆయన.. ఎవరైనా వెళ్లినా అంతకు రెట్టింపు సంఖ్యలో మా దగ్గరకు వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కోటంరెడ్డి రాకను ఇష్టపడని టీడీపీ క్యాడర్ మా దగ్గరకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు ముందు నుంచి ముదురు జిల్లా.. వెళ్లాలనుకునే వారు ఏదో ఒక ఆరోపణలు చేసే వెళ్తారని.. నెల రోజుల్లో పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. బాగా చేసుకుని పరిస్థితిని సెట్ చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.