Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సాంప్రదాయ వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి లేదు? అని లేఖలో ప్రశ్నించిన ఆయన.. ఈ విషయం ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగానైనా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని అందించిన భారత ఖండం ఖ్యాతిని తెలుసుకోండి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని…
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
Satya Kumar: తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉన్నాయి.. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం కేసీఆర్ మరిచిపోయారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరాలని చూసినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.. దొంగ దొరికి పోతున్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు.. ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు…
Sunil Deodhar: సీఎం వైఎస్ జగన్‌ఫై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోదర్.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని ఆరోపించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే జాబు ఇస్తానన్నాడు.. జాబు రాలేదు.. రాష్ట్రంలోకి గంజాయి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని లిక్కర్, ఇసుక మాఫియగా మార్చారని ధ్వజమెత్తిన ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.. పోవాలి జగన్, పోవాలి జగన్.. మన…
CM YS Jagan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన 222వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.. గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నది వెల్లడించింది ఎస్‌ఎల్బీసీ. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ, మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువరుణాలు ఇచ్చామని పేర్కొంది. ప్రాథమిక రంగానికి 2022–23 రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680 కోట్లు.. ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లు.. 99.47శాతం లక్ష్యాన్ని…
Byreddy Siddharth Reddy: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయలసీమలో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా లేరని వ్యాఖ్యానించారు.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి లో శాంతి నెలకొందన్న ఆయన.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో హత్యా రాజకీయాలు లేవన్నారు.. ఇక, జేసీ బ్రదర్స్‌పై విరుచుకుపడ్డ బైరెడ్డి.. జేసీ బ్రదర్స్ కు…
Sajjala Ramakrishna Reddy: రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు.. విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన సభ నుంచి 7 స్థానాలకు అభ్యర్థులను వైసీపీ తరఫున సీఎం జగన్ ఎంపిక చేశారు. మొత్తం 18 స్థానాలకు సోషల్ ఇంజనీరింగ్ అమలు చేశారు. 18 స్థానాల్లో 14 స్థానాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు…
CM YS Jagan: విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్లు ఆ ప్రాజెక్టు పనులు జరుగుతోన్న తీరుపై సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి పైనా సమీక్ష చేశారు.. సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులపై చర్చించారు.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్‌కు వివరాలందించారు అధికారులు. స్మృతివనం…
AP JAC Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు ముగిసిన తర్వాత.. చల్లబడినట్టే కనిపించిన ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.. ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం ముగిసింది.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.. మొత్తంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అభిప్రాయపడింది అత్యవసర కార్యవర్గం. ఆ తర్వాత ఉద్యమ…
Silpa Chakrapani Reddy: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు పార్టీలు మారడం.. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.. అయితే, కొన్నిసార్లు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా త్వరలో మరో పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతుంటుంది.. ఇప్పుడు అలాంటి ప్రచారమే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై జరుగుతోంది.. ఆ ప్రచారంపై స్పందించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలను పదే పదే చెప్పి , నిజమని ప్రచారం చెయ్యడం…