MP Margani Bharat: ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయినా, తాము అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. కానీ, అధికార, విపక్షాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీయే తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.. ప్రత్యేక హోదా లేదని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఎందుకు పరిష్కరించలేదు? అని…
Minister RK Roja: విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఎస్‌ఐ) విజయవంతం కావడంతో.. సంబరాలు నిర్వహిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇప్పటికే సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది.. ఇక, పెట్టుబడుల…
AP Government: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పథకాల అమలుకు బ్రేక్ పడింది.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వరుసగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు ఖరారు చేశారు.. సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు.. అసెంబ్లీ…
Satya kumar: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టింది.. ఈ మేరకు ఆయా సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకుంది.. అయితే, జీఐఎస్‌పై విపక్షాల నుంచి విమర్శలు తప్పడం లేదు.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. శ్రీ సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెలో ఒక్క పైసా కూడా విదేశీ పెట్టుబడి రాలేదని ఆరోపించారు.. బటన్‌లు నొక్కినట్లు ఉత్తుత్తి కార్యక్రమాలు చేయడమేంటి..!…
Family Doctor: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.. అదేరోజు ఒక విలేజ్ క్లినిక్ వద్ద ప్రారంభించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి…
Adimulapu Suresh: సీఎం వైఎస్ జగనే బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీ.. ఏపీలో కల్పిస్తున్న వసతులే మా మంత్రం అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద ఉన్న నమ్మకమే కారణంగా చెప్పుకొచ్చారు.. అందుకే సీఎం జగనే మా బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీగా అభివర్ణించారు.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి…
Vellampalli Srinivas: 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పనిబడతాం.. వాళ్లు ఏమీ పీకలేరు అంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. విశాఖ గ్లోబల్ సదస్సు విజయవంతం అయిన నేపథ్యంలో విజయవాడలో సంబరాలు నిర్వహించారు.. కేక్ కట్ చేసి కార్యకర్తలతో విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.. ఈ సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మార్చి 3, 4…