Minister Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా అధికార, ప్రతిక్షాల మధ్య సభలో సవాళ్ల పర్వం చోటు చేసుకుంది.. మూడు ఎమ్మెల్సీల్లో ఓటమి పాలైనందుకు వైసీపీ సభ్యుల మైండ్ బ్లాంక్ అయ్యిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి సిదిరి అప్పలరాజు.. ధైర్యం ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.. మరోవైపు.. వ్యవసాయ…
CM YS Jagan Review: అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి.. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు.. చేతికొచ్చిన పంట వర్షార్పణం అయినట్టు అయ్యింది.. అయితే, రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.. సీఎంవో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌కు అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు…
CM YS Jagan: నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెబుతూ.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్.. జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది…
Newly Elected MLCs Meet CM YS Jagan: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఇవాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు.. బడ్జెట్ సమావేశాలు కొనసాగుతోన్న నేపథ్‌యంలో.. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్తు రామారావు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్.. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు…
Jagananna Vidya Deevena: విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును రేపు అనగా.. ఈ నెల 19న విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్.. ఈ రోజే విద్యా దీవెన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. సీఎం సభా…
Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ సభ ప్రారంభం అయిన వెంటనే ఆందోళనకు దిగారు తెలుగుదేశం పార్టీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.. కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం…
Somu Veerraju: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా…
Vizag Capital: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. విశాఖ నుంచి పరిపాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి…
Karumuri Nageswara Rao: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం వేదికగా పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావసభలో కులాల ప్రస్తావన గురించే పవన్ మాట్లాడారు.. కానీ, ఆ పార్టీకి దిశ.. దశ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడటమే పవన్ పని.. పార్టీ పొత్తులేదంటారు.. అన్ని సీట్లకు పోటీచేయనంటారు.. పార్టీ…
Government Jobs: నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. ఆ శాఖలో కొత్తగా 1,610 పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని…