CM YS Jagan: అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్ట్.. విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్లు ఆ ప్రాజెక్టు పనులు జరుగుతోన్న తీరుపై సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి పైనా సమీక్ష చేశారు.. సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులపై చర్చించారు.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్‌కు వివరాలందించారు అధికారులు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయన్న అధికారులు.. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందన్నారు. విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని వివరించారు..
Read Also: AP JAC Amaravati: సర్కార్‌కు జేఏసీ షాక్.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
Also Read
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు.. పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలన్న ఆయన.. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్ కూడా అత్యంత ప్రధానమైనది.. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని.. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. ఇక, అంబేద్కర్ విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని.. ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని తెలిపారు అధికారులు.. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎం జగన్‌కు వివరించిన అధికారులు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!