CM Revanth Reddy: పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని… ఇంటర్మీడియట్ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున.. ఆ…
CM Chandrababu Naidu: ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలన్నారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలన్నారు సీఎం. ఇందుకు ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారుకు… ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని సవివరంగా తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్‌ల పరిష్కారంపై సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించారు…
ఆదాయార్జన శాఖలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. మధ్యాహ్నం ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన పై ప్రధానంగా చర్చించారు సీఎం.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ రోజు మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సమీక్షించనున్న ఆయన.. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించనున్నారు.. గిరిజన హాస్టళ్లల్లోని పరిస్థితులపై ఆరా తీయనున్న ఏపీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా…
జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమావేశమాయ్యారు. రాష్ట్ర పరిపాలన, శాంతి భద్రతలతో అధికారులకు దిశనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు జోడెద్దుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ‘అధికారులకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేము. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్లదే. ప్రజా…