CM Chandrababu: పోలవరంపై చంద్రబాబు సమీక్ష.. త్వరలో ప్రాజెక్టు సందర్శన..!
- ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు
- పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్న సీఎం
- సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, పాలనపై ఫోకస్ పెట్టారు.. ఈ రోజు తన కేబినెట్‌లోని 24 మంత్రులకు శాఖలు కేటాయించిన ఆయన.. మరోవైపు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే, సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది.. ఇక, శ్వేత పత్రాల విడుదలకు కూడా సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రతీసోమవారం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ.. పనులపై సమీక్ష నిర్వహిస్తూ వచ్చిన విషయం విదితమే.
Read Also: EPFO: చందాదారులకు షాకింగ్ న్యూస్.. అడ్వాన్స్ సదుపాయం నిలిపివేత
Also Read
మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడుతోనే పూర్తతుందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుకు జలవనల శాఖను కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రైతు సంఘాల ఆధ్వర్యంలో కాటన్ దొర విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి రైతులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రైతుబిడ్డ నిమ్మలకు జలవనుల శాఖ కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. రైతు బిడ్డ రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి ఇరిగేషన్ మంత్రి రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!