తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరిపేందుకు సీఎం రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ పోటీలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. MISS WORLD-2025 కి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మే 10న మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం కానున్నాయి.
Also Read:CM Revanth Reddy Vijayawada Visit: రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. విషయం ఇదే..!
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ తెలిపారు.
Also Read:Delhi: సరిహద్దు ఉద్రిక్తలపై రేపు కేంద్రం సమీక్ష
విభాగాలవారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం సూచించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.